నిర్లక్ష్యంపై వేటు!

ABN , First Publish Date - 2021-01-27T05:36:09+05:30 IST

ప్రజలకు సేవచేస్తూ.. ప్రభుత్వం ఇస్తున్న జీతాలు తీసు కుంటూ తమ విధులను సక్రమంగా నిర్వహించని వారిపై నూతన చట్టాలతో కలెక్టర్‌లు కొరడా ఝలుపిస్తుండడంతో ఆయా శాఖల అధికారులు హడలెత్తిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గత కొన్ని నెలల క్రితం పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యం వహించిన పలువురు పంచాయతీ కార్య దర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు సస్పెన్షన్‌ చే సిన ఘటనలు చాలా ఉన్నాయి.

నిర్లక్ష్యంపై వేటు!

ఉమ్మడి జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కొరడా ఝళిపిస్తున్న కలెక్టర్లు 

సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించిన వారిపై చర్యలు 

నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌  చట్టాలతో కలెక్టర్‌లకు ఫుల్‌ పవర్‌

పనిచేయకపోతే షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో పాటు సస్పెన్షన్‌ వేటు

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కార్యదర్శులకు నోటీసులిచ్చిన కలెక్టర్‌లు

మొన్న రాజంపేట తహసీల్దార్‌.. నిన్న ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు

కామారెడ్డి, జనవరి 26: ప్రజలకు సేవచేస్తూ.. ప్రభుత్వం ఇస్తున్న జీతాలు తీసు కుంటూ తమ విధులను సక్రమంగా నిర్వహించని వారిపై నూతన చట్టాలతో కలెక్టర్‌లు కొరడా ఝలుపిస్తుండడంతో ఆయా శాఖల అధికారులు హడలెత్తిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గత కొన్ని నెలల క్రితం పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యం వహించిన పలువురు పంచాయతీ కార్య దర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు సస్పెన్షన్‌ చే సిన ఘటనలు  చాలా ఉన్నాయి. ఒక పంచాయతీ రాజ్‌ వి భాగంలోనే కాకుండా రెవెన్యూ విభాగంలోనూ విధులలో ని ర్లక్ష్యం వహించిన వారిపై కలెక్టర్‌లు దృష్టిసారించి సస్పెండ్‌ చేస్తున్నారు. గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధి కారులను వారి మాతృసంస్థలకు సరేండర్‌ చేసే అధికారం కలెక్టర్‌లకు ఉండేది. ప్రస్తుత నూతన పంచాయతీరాజ్‌, ము న్సిపల్‌ చట్టాలతో కలెక్టర్‌లకు పూర్తి అధికారులు రావడంతో విధులలో అలసత్వం వహిస్తున్న వారిపై చర్యలకు పూనుకు ంటున్నారు. కామారెడ్డి జిల్లాలో గత నెలరోజుల్లోనే ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసి కలెక్టర్‌ శరత్‌ తన మార్కును చూపించారు. మొన్న కామారెడ్డి నియోజకవర్గంలోని రాజం పేట తహసీల్దార్‌ మోతిసింగ్‌ను, నిన్న ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ను విధులలో నిర్లక్ష్యంగా వ్యవ హరించడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు.

కొత్తచట్టం.. పదవీ గండం

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టాలతో సర్పంచ్‌లతో పాటు కార్యదర్శు ల గుండెల్లో రైళ్లు పరెగెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిధుల దుర్వినియోగంతో పాటు అభివృద్ధి పనుల అమలు లో నిర్లక్ష్యం వహించినా వారికి పదవిగండం తప్పడం లేదు. ఆ చట్టంలోని సెక్షన్‌ 37 సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లతో పాటు పంచాయతీ కార్యదర్శులనూ సస్పెండ్‌ చేసే అధికారం కలెక్ట ర్‌కు కట్టబెట్టింది. అయితే, ఈ చట్టాలను ఎప్పుడు అమలు చేయాలి అని నిర్లక్ష్యపు ఆలోచనచేసిన ప్రతి ఒక్కరికీ ఉమ్మ డి జిల్లా కలెక్టర్‌లు తీసుకుంటున్న చర్యలు సమాధానం చె బుతున్నాయి. 8 నెలల క్రితం హరితహారం, పల్లె ప్రగతి ప నులలో నిర్లక్ష్యం వహించిన వారికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వ డంతో పాటు, సస్పెన్షన్‌ వేటు వేశారు. మున్సిపల్‌, పంచా యతీ రాజ్‌ కొత్తచట్టాన్ని తీసుకువచ్చిన తర్వాత అధికారుల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో కనీసం పట్టించుకోని ఆయా శాఖల అధికారులు సైతం ఎంతో కొంత పనులు చేస్తున్నార ని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయ తీలు ఉండగా.. అందులో ఆరుగురు సర్పంచ్‌లకు, ఆరుగురు కార్యదర్శులు పనితీరులో నిర్లక్ష్యం వహించడంపై కలెక్టర్‌ శరత్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేసిన విషయం విధితమే.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి నోటీసులు  

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ల క్ష్యం వహించిన అధికారులకు కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతో పాటు పలువురిని సస్పెం డ్‌ సైతం చేశారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ కార్యదర్శితో పాటు దోమకొండ మండలం పంచాయతీ సెక్రె టరీకి, అంబర్‌పేట పంచాయతీ సెక్రెటరీకి, జంగంపల్లి కార్య దర్శిని సస్పెండ్‌ చేయాలని వీరితో పాటు దోమకొండ  మం డల కార్యదర్శికి, అంబర్‌పేట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చే యాలని ఆదేశించారు. గాంధారి మండలంలోని పంచాయతీ సెక్రెటరీలకు, పద్మాజివాడి గ్రామపంచాయతీ కార్యదర్శికి, టె క్నికల్‌ అసిస్టెంట్‌కు, ఏపీవోలకు సంజాయిషీ నోటీసులను జారీ చేయాలని డీపీవోకు సైతం ఆదేశాలు జారీ చేశారు.

మొన్న రాజంపేట తహసీల్దార్‌.. నిన్న ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో విధులలో నిర్లక్ష్యం వహి స్తున్న వారిపై కలెక్టర్‌లు వేటు వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మొన్న రాజంపేట తహసీల్దార్‌ మోతిసింగ్‌ ప్రభుత్వ భూములకు పట్టాపాస్‌ పుస్తకాలు జారీ చేయడంతో సస్పెం డ్‌ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ మున్సిపల్‌ పరిధిలోని మూడు వార్డులలోని ప్రజలకు పింఛ న్‌లను తొలగించడంతో ఆయా పింఛన్‌దారులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున్న ఆందోళన చేయడంతో వి చారణకు ఆదేశించిన కలెక్టర్‌ శరత్‌.. మున్సిపల్‌ కమిషనర్‌ నిర్లక్ష్యం ఉందని గ్రహించి ఆయనను మంగళవారం సస్పెం డ్‌ చేశారు. నూతన చట్టాలతో కలెక్టర్‌లకు పూర్తి అధికారం అందడంతో విధులలో అలసత్వం వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పడం లేదు. ఇప్పటికే విధులలో అల సత్వంపై ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఇకనైనా త మపై దృష్టిసారిస్తున్న కలెక్టర్‌ల వేటుకు గురికాకుండా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారో? లేదంటే కలెక్టర్‌ల కొర డాకు బలవుతారో వేచి చూడాల్సిందే.

ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ సస్పెన్షన్‌

పింఛన్‌లు తొలగించినందుకు సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌ 

కంప్యూటర్‌ ఆపరేటర్‌ కూడా తొలగింపు

ఎల్లారెడ్డి, జనవరి 26: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిష నర్‌ ఖమర్‌ అహ్మద్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ శరత్‌ మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 39 మంది పింఛ న్‌లను తొలగించినందుకు బాధ్యుడిని చేస్తూ స స్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అ తడితో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను సైతం విధుల నుంచి తొలగించారు. కమిషనర్‌, కం ప్యూటర్‌ ఆపరేటర్‌ల జీతాల నుంచి కొంత నగదును బాధితులకు కలెక్టర్‌ ఇప్పించారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 7, 8, 9 వార్డులలోని 39 మంది ఆసరా, బీడీ, వృద్ధాప్య పిం ఛన్లు కలిగిన లబ్ధిదారుల పేర్లను గత సంవత్సరం నవంబ రులో తొలగించడంతో మూడు నెలలుగా వారికి పింఛన్లు రాలేదు. 8వ వార్డుకు చెందిన టీఆర్‌ ఎస్‌ కౌన్సిలర్‌ భోజ య్య ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు కాకుం డా కాంగ్రెస్‌కు ఓటు వేశారనే కారణంతో ఆ 39 మంది పింఛన్‌లను కొందరు అధికారుల సహ కారంతో తొలగించినట్లు బాధితులు ఆరోపణలు చేయడమే కాకుండా ఇటీవల మున్సిపల్‌ కార్యా లయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఎ ల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ బాధితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వారి పింఛన్లు తిరిగి ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. బాధితులు కలె క్టర్‌ శరత్‌ దృష్టికి తీసుకెళ్లగా, మున్సిపల్‌ కమిషనర్‌ను బా ధ్యుడిని చేస్తూ సస్పెండ్‌ చేశారు. 

బాధితులకు డబ్బులు ఇప్పించిన ఎమ్మెల్యే

39 మందికి సంబంధించి 3 నెలల ఫించన్‌ డబ్బులు రూ.2.34 లక్షలు బాధితులకు ఎమ్మెల్యే సురేందర్‌ ప్రభు త్వం తరపున ఇప్పించారు. తిరిగి వారి పేర్లను ఆసరా పిం ఛన్‌లో రీ ఎంట్రీ చేయించారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్ట ణంలోని తన క్యాంపు కార్యాలయంలో 2 లక్షల 34 వేల 840 రూపాయలను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి అందరికీ పింఛన్లు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లే దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడు ముల సత్యనారాయణ, మున్సిపల్‌ మేనేజర్‌, నాయకులు జ లేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌లు నీలకంఠం, రాము, అల్లం శ్రీను, గో పి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:36:09+05:30 IST