నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-01-22T04:29:48+05:30 IST

బి.కొత్తకోట మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగంపై జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.

నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవు

జడ్పీసీఈవో ప్రభాకర్‌రెడ్డి

బి.కొత్తకోట, జనవరి 21: బి.కొత్తకోట మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగంపై జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 -21 మధ్యకాలంలో ప్రత్యేక అధికారుల పాలనలో ఇక్కడ పనిచేసిన కొంతమంది సిబ్బంది నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలిందన్నారు. బిల్‌ కలెక్టర్‌ అయిన డేనియల్‌తో పాటు ఆరుగురు పంచాయతీ  సిబ్బంది పంపు ఆపరేటర్లుగా ఉండి బిల్‌ కలెక్టర్లుగా మారి ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూలు చేసి లక్షల్లో స్వాహా చేశారన్నారు. ఇదివరకే డీఆర్‌డీఏ పీడీ తుల సమ్మ విచారణ చేశారన్నారు. పీడీ ఇచ్చిన రిపోర్టులపై మళ్లీ విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో రూ.1.19 కోట్ల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని వివరిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, నగర పంచాయతీ కమిషనర్‌ వెంకట్రామయ్య, ఈవోఆర్డీ అశ్విని, సిబ్బంది పాల్గొన్నారు.




Updated Date - 2022-01-22T04:29:48+05:30 IST