ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలుండాలి!

ABN , First Publish Date - 2022-06-26T08:12:13+05:30 IST

ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలుండాలి!

ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలుండాలి!

చిత్తూరు ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలతపై పోలీసు వాహనం ఎక్కించడం, హత్య కేసులో సాక్షులను పోలీసులే బెదిరించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై డీజీపీకి శనివారం లేఖ రాశారు. చిత్తూరులో కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరించి, కేసును నీరు గార్చేందు కు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తూ స్థానిక పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారంటూ వివరణాత్మక ఆరోపణ చేశారు. పూర్ణపై అక్రమ కేసు పెట్టి, హేమలతపై దారుణంగా వ్యవహరించిన పోలీసులపై, వైసీపీ వారి కోసం సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసుల పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. 


నారాయణ మృతికి కారకులు ఎవరు?

దళితుల ప్రాణాలు తీసిన వారిని ప్రభుత్వం కాపాడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ అనే దళిత వ్యక్తి మృతి చెందిన ఘటనలో వాస్తవాలు బయట పెట్టాలన్నారు. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగా నారాయణ చనిపోయారనే కుటుం బ సభ్యుల వాదనకు అధికారులు ఎందుకు సమాధానం చెప్పటం లేదని శనివారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు నిలదీశారు.  


Updated Date - 2022-06-26T08:12:13+05:30 IST