దారి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-18T03:43:08+05:30 IST

మంచిర్యాల పట్టణానికి తాగు నీరందించే ముల్కల్ల పంప్‌హౌజ్‌కు వెళ్ళే దారిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేకు మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు.

దారి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌

ఏసీసీ, మే 17 : మంచిర్యాల పట్టణానికి తాగు నీరందించే ముల్కల్ల పంప్‌హౌజ్‌కు వెళ్ళే దారిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేకు మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు.  చైర్మన్‌ మాట్లాడుతూ ముల్కల్లలో గోదావరి ఒడ్డున గల పంప్‌హౌజ్‌ వరకు దారిని 1970 లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. సర్వేనెంబర్లు 97, 100, 101లలో విస్తీర్ణం మూడెకరాల 10 గుంటల స్థలంలో జాతీయ రహదారి నుంచి పంప్‌హౌజ్‌ వరకు 50 ఫీట్ల వెడల్పు గల రోడ్డును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించడానికి యత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకొని మున్సిపల్‌ ఆస్తులను రక్షించాలని పేర్కొన్నారు. వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, సింగిల్‌ విండో చైర్మన్‌ సందెల వెంకటేష్‌, గోగుల రవీందర్‌, కౌన్సిలర్‌ సురేష్‌ బల్దువా, రవీందర్‌రావు, తాజొద్దీన్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-05-18T03:43:08+05:30 IST