‘దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-07-11T10:48:42+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజగృహంపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు

‘దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’

పత్తికొండటౌన్‌, జూలై 10: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజగృహంపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుభాష్‌చంద్ర డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీదేవికి ఆమె కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు రాముడు, పులికొండ, తిరుపాలు, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు రవికుమార్‌, రమేష్‌, ఠాగూర్‌, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. 


ఆదోని(అగ్రికల్చర్‌): రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాజగృహంపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ పట్టణ అధ్యక్షుడు హెబ్బటం రాజు, మండల ఉపాధ్యక్షుడు వెంకటరాముడు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలతో రాజగృహానికి పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో విజయ్‌, వీరస్వామి, గుండప్ప పాల్గొన్నారు. 


బనగానపల్ల్లె: ముంబైలోని అంబేడ్కర్‌ రాజగృహంపై దాడి చేయడం దారుణమని, దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేడం సుబ్బరా యుడు కోరారు. అవుకు మెట్ట వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి నిరసన వ్యక్తం చేశారు. బాలమద్ది రాజు, శిఖామణి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


నందికొట్కూరు: ముంబైలో బీఆర్‌ అంబేద్కర్‌ ఇంటిపై దాడిచేసిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్‌, నగేష్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చే సిన సమావేశంలో వారు మాట్లాడారు. అంబేడ్కర్‌ నివాసానికి భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. నిందితులను వెంటనే గుర్తించాలన్నారు. చరణ్‌, జయపాల్‌, ఉదయ్‌, శ్రీరామ్‌ పాల్గొన్నారు. 


హొళగుంద: ముంబైలోని అంబేడ్కర్‌ నివాస గృహంపై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఫక్కీరప్ప డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎంతటివారినైనా శిక్షించాలన్నారు. నాయకులు బజారప్ప, రామప్ప, శేకప్ప, ఈరప్ప, హుసేనప్ప పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ రాజగృహంపై దాడిచేయటం అమానుషమని అంబేడ్కర్‌ భవన సాధన కమిటి ఛైర్మన్‌ కదిరికోట ఆదెన్న అన్నారు. ఈ ఘటనపై కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.నిందితులను అరెస్టుచేసి కటినంగా శిక్షించాలన్నారు. 

Updated Date - 2020-07-11T10:48:42+05:30 IST