Jul 25 2021 @ 00:22AM

సెట్స్‌పైకి ఖిలాడి

వితేజ కథానాయకుడిగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్‌’ ట్యాగ్‌లైన్‌. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ కథానాయికలు. ఈ నెల 26 న రవితేజ ‘ఖిలాడి’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సినిమాలో బైక్‌పై స్టైలి్‌షగా కూర్చున్న రవితేజ ప్రచారచిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘థియేటర్స్‌లో ఆడియన్స్‌కు మంచి సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు దర్శకుడు రమేశ్‌వర్మ ఎక్స్‌ట్రా ఎఫర్ట్‌ పెట్టి పనిచేస్తున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.