నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు

ABN , First Publish Date - 2020-04-10T11:50:17+05:30 IST

బొబ్బిలి పట్టణంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై సంచరిస్తున్న సుమారు వందమంది యువకులను స్థానిక

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు

50మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు  


బొబ్బిలి, ఏప్రిల్‌ 9: బొబ్బిలి పట్టణంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ  ద్విచక్ర వాహనాలపై సంచరిస్తున్న సుమారు వందమంది యువకులను స్థానిక సీఐ ఇ.కేశవ రావు పట్టుకున్నారు. వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుస్టేషన్‌లో చేర్పించా రు. దీంతో ఆ వాహనాల యజమానులు వందలాదిగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని రాత్రి పది గంటల వరకు తమ బైకుల కోసం పడిగాపులు కాశారు.


వారంతా పోలీసులను, సీఐని  ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు. బలమైన కారణాలు చూపించిన వారిని మాత్రమే వదిలివేసి, సుమారు 50 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బైకులను సీజ్‌ చేశారు. ఈసందర్భంగా సీఐ కేశవరావు మాట్లాడుతూ గత 18 రోజులుగా పట్టణంలోని అన్ని కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వాహనా లపై చలానాలు రాసినా, షరా మామూలుగానే నిబంధనలను ఉల్లంఘిస్తు న్నారన్నారు. అందుకే మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Updated Date - 2020-04-10T11:50:17+05:30 IST