రైతులపై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి : ఏలేటి

ABN , First Publish Date - 2020-06-02T10:33:51+05:30 IST

దేశానికి అన్నం పెట్టే రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు వీడాలని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. సోమవారం

రైతులపై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి : ఏలేటి

నిర్మల్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): దేశానికి అన్నం పెట్టే రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు వీడాలని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం లోని తన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అమ్ముకోవడానికి రోజుల తరబడి రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ధాన్యం తూకంలో మోసంతో పాటు అనేక రకాలుగా దోచుకుంటున్నారన్నారు. చివరి గింజ వరకు కొంటామన్న ప్రభుత్వం.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలులో అధికార పార్టీ నాయకుల అండతోనే రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలని ఆంక్షలు పెట్టడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నా రని, ప్రస్తుత అవేవీ పట్టించుకోవడం లేదన్నారు.


అకాల వర్షంతో రైతులు నష్టపోయినా.. ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పీసీసీ అఽధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డిపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అహంకార పూరితమైన ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. రైతాంగ సమస్యల సాధనకై కాంగ్రెస్‌ పార్టీ రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో దిలావర్‌పూర్‌ జడ్పీటీసీ సభ్యులు తక్కల రమణారెడ్డి, నాయకులు సత్యం చంద్రకాంత్‌, మార గంగారెడ్డి, ఓడ్నాల రాజేశ్వర్‌, ముత్యంరెడ్డి, జమాల్‌, పోతన్న, నాందేడపు చిన్ను, కె. పోశేట్టి, తదితరులున్నారు.

Updated Date - 2020-06-02T10:33:51+05:30 IST