దారికి అడ్డంగా..

ABN , First Publish Date - 2021-07-19T03:53:51+05:30 IST

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో అంతర్గత రహదారిపై ఉన్న విద్యుత్‌ స్తంభాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దారికి అడ్డంగా..
కల్వకోల్‌ గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు

- విద్యుత్‌ స్తంభాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

- పట్టించుకోని అధికారులు


పెద్దకొత్తపల్లి, జూలై 18: విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో అంతర్గత రహదారిపై ఉన్న విద్యుత్‌ స్తంభాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌ గ్రామంలోని దళిత కాలనీలో 30ఏళ్ల క్రితం కాలనీవాసుల అవసరాల కోసం విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి రోడ్డు మధ్యలో అడ్డంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. ఇనుప స్తంభాలు కావడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువులు ఆ రహదారిపై నిత్యం సంచరిస్తుంటాయి. ఆదమరిస్తే ఎప్పుడు ప్ర మాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. రహదారిపై అడ్డంగా ఉన్న స్తంభా లను తొలగించాలని పలుమార్లు విద్యుత్‌ శాఖాధికారులకు, ప్రజాప్రతిని ధులకు మొర పెట్టుకున్న పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విద్యుత్‌ స్తంభాలను రోడ్డు మధ్యలో నుంచి తొలగించాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు. 


 స్తంభాలను తొలగిచాలి

గ్రామంలోని ఎస్సీ కాలనీలో రోడ్డుపై అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను వెంటనే తొలగించాలి. రోడ్డుపై స్తంభాలు అడ్డంగా ఉండడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతున్నది. స్తంభాలను వేరే చోట ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.

- గువ్వలి వెంకటయ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి

 



Updated Date - 2021-07-19T03:53:51+05:30 IST