వట్టిపల్లిలో క్రీడల స్థలసేకరణ పరిశీలిస్తున్న తహసీల్దార్, ఎంపీడీవో
మర్రిగూడ, మే 25: మినీ బృహత ప ల్లె ప్రకృతివనం, క్రీడ ల ప్రాంగణాల కోసం అధికారులు స్థల సేకరణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దా ర్ సంఘమిత్ర, ఎం పీడీవో రమేష్ దీనదయాళ్ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో 158, 160 సర్వే నెంబర్, వట్టిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 147 మూడు ఎకరాలు సంబంధించిన పల్లె ప్రకృతివ నం కోసం స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా క్రీడల ప్రాంగణం కోసం భీమనపల్లిలోని సర్వేనెంబర్ 516, 517లో గల ఒక ఎకరం, లెంకలపల్లిలోని 160 సర్వే నెంబర్లో ఒక ఎకరం, సరంపేటలో 314లో ఒక ఎకరం భూమిని, వట్టిపల్లిలో 272, 273 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలాల్లో తెలంగాణ క్రీడల ప్రాంగణాల కోసం స్థలాన్ని సేకరించినట్లు తెలిపారు. 20 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న గ్రా మాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ వెంట ఎంపీవో ఝాన్సీ, ఆర్ఐలు ముస్తఫా, బషీర్, గ్రామ కార్యదర్శి ఉన్నారు.