మృత్యుఘోష

ABN , First Publish Date - 2022-08-09T06:25:46+05:30 IST

దైవ దర్శనానికి వెళుతూ రోడ్డుప్రమాదంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది.

మృత్యుఘోష
రోధిస్తున్న నాగిరెడ్డి తల్లి


దైవదర్శనానికి వెళుతూ ఐదుగురు మృతి

ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఘటన

మృతులు పల్నాడు జిల్లావాసులు

అందరిదీ ఒకే కుటుంబం

   

వెల్దుర్తి, బేస్తవారిపేట, ఆగస్టు8: దైవ దర్శనానికి వెళుతూ రోడ్డుప్రమాదంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామాని కి చెందిన జూలకంటి నాగిరెడ్డి లండన్‌లో ఎం ఎస్‌ చదువుతూ మంచి ఉద్యోగం సాధించాడు. కొన్నిరోజులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన నాగిరెడ్డి స్వగ్రామానికి వచ్చి తమ మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఆది వారం రెండు కార్లలో  తిరుపతి ప్రయాణ మయ్యాడు. ఒక కారులో తాతయ్య చిలకల హనిమిరెడ్డి, అమ్మమ్మలు ఆదిలక్ష్మి, గురవమ్మ, అనంతరావమ్మ కలసితానే కారు నడు పుతూ బయలుదేరాడు. మార్గ మధ్యలో ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నాగిరెడ్డి (24)తోపాటు తాతయ్య హనిమిరెడ్డి(60), అమ్మ మ్మలు ఆదిలక్ష్మి(58), గురవమ్మ(56), అనంతరా వమ్మ(55) అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది కాల్‌డేటా ఆధారంగా మరో కారులో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా ప్రాంతానికి చేరుకొని శిరిగిరిపాడులో ఉన్న తమ బంధువులకు సమా చారమిచ్చారు.  


తల్లిదండ్రులు ఆశలు అడియాశలు.. 

కూలినాలి చేసుకొని కొడుకును ఉన్నత చదు వులు చదివించి మంచి ఉద్యోగం రావటంతో తమ కష్టాలు తీరుతాయనుకున్న తల్లిదండ్రులు ఆశలు అడియాశలయ్యాయి. నాగిరెడ్డి తండ్రి జూ లకంటి హనిమిరెడ్డి, తల్లి గురవమ్మలు వ్యవ సాయ కూలిపనులు చేసుకుంటూ నాగిరెడ్డితో పాటు మరో కొడుకు శ్రీనివాసరెడ్డిని మంచి చదు వులు చదివించారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి ఉద్యోగవేటలో ఉండగా నాగిరెడ్డి మంచి ప్యాకే జీతో లండన్‌లో ఉద్యోగం సాధించాడు. ఈలోగా ఈ దుర్ఘటన వారి కుటుంబాన్ని తీవ్ర దుఃఖానికి గురిచేసింది. 


గ్రామంలో విషాద ఛాయలు 

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందటంతో వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. ఒకే ఇంట్లో పుట్టిపెరిగిన అక్కాచెల్లెళ్లు ఆదిలక్ష్మి, గుర వమ్మ, అనంతరావమ్మలు ఒకేసారి తనువు చాలించటంతో బంధువులు తీవ్ర విషాదంలో ము నిగిపోయారు. ఆదిలక్ష్మి, గురవమ్మలు శిరిగిరి పాడులో ఉంటుండగా అనంతరావమ్మ బొల్లాపల్లి మండలం రేవిడిచర్లలో ఉంటోంది. ఆదివారం తిరుపతికి వెళ్లేందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలు సుకొని ఒకే కారులో పయనమయ్యారు.  


ఎమ్మెల్యే పీఆర్కే, బ్రహ్మారెడ్డి, శివారెడ్డి పరామర్శ 

గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను సోమవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి, తెలుగుదేశంపార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జూలకంటి బ్రాహ్మారెడ్డి, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ  కుర్రి శివా రెడ్డిలు పరామర్శించారు.  కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

Updated Date - 2022-08-09T06:25:46+05:30 IST