సెల్లార్‌ గుంతలో పడిన కంటెయినర్‌

ABN , First Publish Date - 2021-02-24T06:29:02+05:30 IST

సెల్లార్‌గుంతలో కంటెయినర్‌ పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.

సెల్లార్‌ గుంతలో పడిన కంటెయినర్‌
మృతి చెందిన ఉపేందర్‌ మహ్జీ

ఇద్దరు కార్మికుల మృతి

మూడు గంటల పాటు ఇనుప చువ్వల కిందే కార్మికుడు

శ్రమించి కాపాడిన పోలీసులు.. ఆసుపత్రిలో మృతి

పేట్‌బషీరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సెల్లార్‌గుంతలో కంటెయినర్‌ పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగిం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేట్‌బషీరాబాద్‌లో మూడు నెలల నుంచి ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ సెల్లార్‌ తీసి అపార్ట్‌మెంట్ల కోసం నిర్మాణాలు చేపడుతోంది. ఒడిషాకు చెందిన కార్మికులు అక్కడే షెడ్లల్లో నివాసం ఉంటూ నిర్మాణ పనులు చేస్తున్నారు. మంగళవారం ఏపీ 29 పీఏ 6061 నెంబర్‌ గల కంటెయినర్‌ భవన నిర్మాణ పనులకు కావల్సి న ఇనుమ చువ్వలు (స్టీల్‌) తీసుకుని సెల్లార్‌కు వచ్చింది. అన్‌లోడ్‌ చేసేందుకు వాహనం వెనకకు తీస్తుండగా, అదుపు తప్పి సుమారు 20 అడుగుల సెల్లార్‌ గుంతలో పడింది. కంటెయినర్‌ రెండు ముక్కలుగా విడిపోయి ఇంజన్‌ ఓ పక్క కు, ట్రాలీ మరో పక్కకు పడిపోయింది. ఆ సమయంలో సెల్లార్‌లో 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఉపేందర్‌ మహ్జీ (22) అనే కార్మికుడు ఇనుప చువ్వల కింద పడి అక్కడికక్క డే మృతి చెందాడు. మరో కార్మికుడు మనోహర్‌ మహ్జీ (25) ఇనుప చువ్వల కిందే మూడు గంటలపాటు ఇరుక్కుపోయాడు. తోటి కార్మికుల సమాచారం మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది, ఇతరుల సహాయంతో ఎక్సకవేటర్‌ను ఉపయోగించి మనోహర్‌ను బయటకు తీశారు. 108లో సమీప ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో సాయంత్రం మృతి చెందాడు. కంటెయునర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్‌ తెలిపారు. 



Updated Date - 2021-02-24T06:29:02+05:30 IST