ప్రమాదాలపై ప్రణాళిక

ABN , First Publish Date - 2021-01-19T07:04:34+05:30 IST

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేం దుకు సీపీ సజ్జనార్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రమాదాలపై ప్రణాళిక
ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌ యాప్‌ను ఆవిష్కరిస్తున్న హోంమంత్రి

  • సైబరాబాద్‌లో 124 బ్లాక్‌ స్పాట్లు
  • ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సీపీ సజ్జనార్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది రహదారి భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. సీపీ ఆదేశాలతో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రోజూ జరు గుతున్న ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్నారు. ఏడాది మొత్తంలో ఒకే ప్రాంతంలోని 500 మీటర్ల పరిధిలో ఐదు ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని యాక్సిడెంట్‌ స్పాట్‌గా గుర్తించారు. సైబరాబాద్‌ పరిధిలో మొత్తం 124 బ్లాక్‌ స్పాట్లు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది 2,951 ప్రమాదాలు జరగగా, 663 మంది మృతి చెందారు. 


ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

రోడ్డు ప్రమాదాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నాము. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను రికార్డు స్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాం. 

- విజయ్‌కుమార్‌, డీసీపీ ట్రాఫిక్‌, సైబరాబాద్‌ 


బ్లాక్‌స్పాట్లు ఉన్న రోడ్లు

రోడ్లు             సంఖ్య

జాతీయ రహదారులు         34

ఎన్‌హెచ్‌ ఆర్‌అండ్‌బీ         11

ఆర్‌ అండ్‌ బీ  మాత్రమే 13

హెచ్‌ఆర్‌డీసీఎల్‌- సీఆర్‌ఎంపీ 57

జీహెచ్‌ఎంసీ                 01

టీఎ్‌సఐఐసీ         01

హెచ్‌జీసీఎల్‌                 06

మున్సిపాలిటీ                 01

మొత్తం 124



టీ-20 ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌ యాప్‌

అందుబాటులోకి తీసుకొచ్చిన హోంమంత్రి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా టీ 20 ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌ యాప్‌ను సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌ టెస్ట్‌ యాప్‌లో ప్రజలు సలహాలు, సూచనలు అందించేందుకు సజెషన్స్‌ ఆప్షన్‌ ఉండాలని కోరారు. యాప్‌ను డెవలప్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ సిబ్బంది మధుసూధన్‌, శ్రీనివా్‌సలకు జ్ఞాపికను బహూకరించారు. ఈ యాప్‌లో 18 మార్కులు సాధించిన శ్రీనివాస్‌, ఇమ్రాన్‌షరీ్‌ఫలకు ట్రాఫిక్‌ కప్‌లను అందించారు. 

ట్రాఫిక్‌ విభాగం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వల్ల గత నాలుగేళ్లలో కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల్లో మరణాలు గణనీయంగా తగ్గాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కొత్త యాప్‌ త్వరలో గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. 


ఇదీ యాప్‌.. 

18 ఏళ్లు నిండిన వాళ్లు టెస్ట్‌కు అర్హులు

ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది

ప్రాక్టీస్‌ టెస్ట్‌ కోసం అందుబాటులో లింక్‌

20 ప్రశ్నలకు గాను 18 మార్కులు సాధిస్తే వారికి ట్రాఫిక్‌ కప్‌

20 మార్కులు సాధించిన వారికి ప్రత్యేక బహుమతి

Updated Date - 2021-01-19T07:04:34+05:30 IST