అమరావతి: తిరుపతిలో రైతుల సభను విజయవంతం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ సానుభూతిపరులు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేతగాక వైసీపీ నాయకులు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని అచ్చెన్న దుయ్యబట్టారు.