Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ నేతల చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నా: అచ్చెన్న

అమరావతి:  వైసీపీ నేతల చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజను వైసీపీ నేతలు వేధిస్తూ, అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎన్నికలయ్యాక కూడా ఇంకా వేధిస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే ప్రజామద్ధతుతో గెలవాలన్నారు. రవితేజ ఇంట్లోని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించిన దుర్మార్గులపై ఫోక్సో  చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా బాధితులపై, సంబంధంలేని వారి మీద తిగిరి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంతకంత మూల్యం చెల్లించుకుంటారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Advertisement
Advertisement