లోకేష్‌ను, నన్ను విడదీయలేరు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-04-13T21:22:05+05:30 IST

టీడీపీ యువ నాయకుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని విడ‌దీయ‌లేవని సీఎం జగన్‌పై

లోకేష్‌ను, నన్ను విడదీయలేరు: అచ్చెన్న

శ్రీకాకుళం: టీడీపీ యువ నాయకుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని విడ‌దీయ‌లేవని సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.  తిరుపతి ఉప ఎన్నికలో జగన్‌కు ఓట‌మి భ‌యం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్యపై నారా లోకేష్ విసిరిన స‌వాల్‌కి తోక‌ ముడిచావని జగన్‌ని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. 


నిన్న చంద్రబాబు స‌భ‌పై రాళ్లేయించావు, ఈ రోజు నా సంభాష‌ణ‌ల్ని వ‌క్రీక‌రించావని అచ్చెన్నాయుడు ఆరోపించారు.నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని త‌ప్పుడు‌ వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించ‌లేవని జ‌గ‌న్‌రెడ్డి పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్ని విష‌ ప‌న్నాగాలు ప‌న్నినా టీడీపీ విజ‌యాన్ని ఆప‌లేవని జగన్‌ను అచ్చెన్న హెచ్చరించారు. 

Updated Date - 2021-04-13T21:22:05+05:30 IST