విజయవాడలో హై టెన్షన్ వాతావరణం.. అచ్చెన్న నివాసం వద్ద భారీగా పోలీసులు

ABN , First Publish Date - 2022-03-23T17:54:41+05:30 IST

విజయవాడ: నగరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఇంటి వద్ద...

విజయవాడలో హై టెన్షన్ వాతావరణం.. అచ్చెన్న నివాసం వద్ద భారీగా పోలీసులు

విజయవాడ: నగరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే తాను పార్టీ కార్యాలయానికి వెళ్తున్నానన్నారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక సమాజంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. హౌస్ అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ సారా తాగి చనిపోతే ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో దీనిపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసన తెలిపేందుకు వీలు లేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-23T17:54:41+05:30 IST