Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యం: అచ్చెన్న

అమరావతి: వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు  గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు  నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళా  హోంమంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారం ఉందని మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్న వారికి రాబోయే రోజుల్లో మహిళల చేతిలో బడితెపూజ ఖాయమన్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఇక వారి అరాచకాలు సాగవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్న విషయం వైసీపీ గుర్తుంచుకోవాలన్నారు. మళ్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని, దాడికి కారణమైనవారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement