Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా మాటలు బాధకలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా..: అచ్చెన్న

అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చున్నాయుడు హాజరయ్యారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమిటీ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు బాధకలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అదే విషయాన్ని కమిటీ ముందు చెప్పానని అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ముందు చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల గతంలో కమిటీ ముందుకు రాలేకపోయానన్నారు.


స్పీకర్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న అంశాలపై ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆ ప్రెస్ నోట్‌పై తన సంతకం కూడా లేదన్నారు. అయినా ఎలాంటి బేషజాలు లేకుండా విచారం వ్యక్తం చేశానని చెప్పానన్నారు. కమిటీ తన వివరణతో సంతృప్తి చెందినట్లు భావిస్తున్నానని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement