Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్..: అచ్చెన్న

అమరావతి: దేశంలో కొబ్బరికాయ  కొట్టి పనులు మొదలు పెడితే.. రాష్ట్రంలో జేఎంఎం ట్యాక్సులు కట్టి పనులు ప్రారంభించాల్సి వస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా  స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్సులు చెల్లిస్తేనే పనులు చేయనిస్తున్నారని అన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపులే ఇందుకు నిదర్శనమన్నారు. వారి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లిక్కర్, ఇసుక, మైనింగ్, రేషన్, పేకాట ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఇప్పుడు కాంట్రాక్టర్లపై పడ్డారని మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో వందలాది మంది కాంట్రాక్టర్లు నాయకుల దోపిడీకి భయపడి పోయారన్నారు. జగన్నాద రథ చక్రాలొస్తున్నాయని ప్రజలకు చెప్పి.. వాహనాల చక్రాలు ఊడిపోయేలా పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీరు ఇలాగే వుంటే..రహదారుల గోతుల్లో మిమ్మల్ని, మీపార్టీని ప్రజలు తొక్కేస్తారని అచ్చెన్నాయుడు అన్నారు.

Advertisement
Advertisement