Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తులకు జగన్.. క్షమాపణలు చెప్పాలి: అచ్చెన్నాయుడు

విజయవాడ: ఇప్పటివరకు తొలగించిన గణేశ్ విగ్రహాలను.. యథాస్థానంలో ప్రతిష్ఠించి, భక్తులకు సీఎం జగన్.. క్షమాణలు చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు చెబితే వద్దనటానికి పోలీసులు ఎవరని.. ప్రశ్నించారు. విజయవాడ కానూరులో ప్రైవేట్ స్థలాల్లో  భక్తులు ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను తొలగించటం సరికాదన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకొంటూ ఉంటే ప్రభుత్వం వేధింపులకు తెరలేపిందని విమర్శించారు. పోలీసులు మండపాల్లోకి వెళ్లి విగ్రహాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం ఏంటని దుయ్యబట్టారు. వినాయక చవితిని ప్రజలు జరుపుకోవడం జగన్‌కు ఇష్టం లేదా.. అని అన్నారు. చెత్తశుద్ధిని పక్కన పెట్టి.. చిత్తశుద్దితో పరిపాలన చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన హితవుపలికారు.

Advertisement
Advertisement