Abn logo
Jan 21 2021 @ 12:46PM

మెగా టీజర్ వచ్చేస్తోందా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్‌కు రామ్‌చరణ్ కూడా హాజరయ్యాడు. ఈ సినిమాలో చెర్రీ `సిద్ధ` పాత్రలో కనిపించనున్నాడు. 


రిపబ్లిక్ డే సందర్భంగా మెగాభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. ఈ నెల 26న `ఆచార్య` సినిమా టీజర్ విడుదల కాబోతోందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Advertisement
Advertisement
Advertisement