ఆచార్య జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2022-08-07T06:01:35+05:30 IST

ఆచార్య జయశంకర్‌ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

ఆచార్య జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి
జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ 

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 6: ఆచార్య జయశంకర్‌ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. ఆచార్య జయశంకర్‌ జయంతి సంధర్బంగా శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి , అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి కలెక్టర్‌ నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్‌ జయంతిని నిర్వహిస్తున్నామని, ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఆచార్య జయశంకర్‌ ఆశయాల సాధనకోసం కృషి చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్‌లు లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, కలెక్టరేట్‌ ఏవో ప్రసాద్‌, జిల్లా అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:01:35+05:30 IST