చాణక్య నీతి: ఈ లక్షణాలుంటేనే సమాజంలో అత్యున్నత స్థానం!

ABN , First Publish Date - 2022-05-10T13:02:32+05:30 IST

ఆచార్య చాణక్య గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త...

చాణక్య నీతి: ఈ లక్షణాలుంటేనే సమాజంలో అత్యున్నత స్థానం!

ఆచార్య చాణక్య గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త మాత్రమే కాదు అతను తెలిపిన విజయవంతమైన విధానాలు సాధారణులను సైతం మహోన్నతులుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు రాసిన నీతి సూత్రాలు మనిషి విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి అనేక మార్గాలను చూపిస్తాయి. డబ్బు నష్టాన్ని నివారించడంతో పాటు ధనవంతులుగా మారడం ఎలాగో కూడా చాణక్య తెలియజెప్పాడు. చాణక్య విధానంలోని ఈ విషయాలను జీవితంలో అమలు చేస్తే, మనిషి ఎప్పుడూ ఇబ్బందుల్లో పడడు. 




ఆచార్య చాణక్యుని నీతి ప్రకారం ప్రతి వ్యక్తి తన జీవితంలో పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవి మనిషికి అపారమైన సంపదను ఇవ్వడమే కాకుండా, అతనికి గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఇతరులకు సహాయం చేసే గుణం, ఇతరుల పట్ల సద్భావన కలిగిన వారికి జీవితంలోని అన్ని కష్టాలు వాటికవే తొలగిపోతాయి. అటువంటివారు అంచెలంచెలుగా డబ్బు సంపాదిస్తారు. జీవితంలోని ప్రతి ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా కష్టాల్లో చిక్కుకుంటే వారికి సహాయం చేయడానికి ఇతరులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అటువంటివారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిమగ్నమైనవారు సమాజంలో తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. వారిని అదృష్టం ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది. అలాంటివారు ఏ పని చేసినా, వ్యాపారం చేసినా విజయం సాధిస్తారు.

Read more