చాణ‌క్య‌నీతి: బంగారంలాంటి స్నేహంలో చిచ్చుపెట్టే విష‌యాలివే.. తెలుసుకోకుంటే మంచి స్నేహితుల‌ను మిస్స‌వుతారు!

ABN , First Publish Date - 2021-10-21T11:51:47+05:30 IST

ఆచార్య చాణక్యుడు జీవితంలోని అనేక అంశాలలో..

చాణ‌క్య‌నీతి: బంగారంలాంటి స్నేహంలో చిచ్చుపెట్టే విష‌యాలివే.. తెలుసుకోకుంటే మంచి స్నేహితుల‌ను మిస్స‌వుతారు!

ఆచార్య చాణక్యుడు.. జీవితంలోని అనేక అంశాలలో పాటించాల్సిన‌ నైతికతను వివరించారు. చాణక్యుడు తాను క‌నుగొన్న జీవిత విధానాల సాయంతో.. సాధార‌ణ బాలుడైన చంద్రగుప్తుడిని మౌర్య వంశానికి చక్రవర్తిగా చేశారు. ఆచార్య చాణక్య.. స్నేహానికున్న‌ గొప్ప‌తనాన్ని, మంచి స్నేహితుల‌ను నిల‌బెట్టుకునే విధానాల‌ను వివ‌రించారు.  కొన్ని విషయాల కార‌ణంగా మంచి స్నేహం కూడా దెబ్బతింటుందని చాణక్యుడు తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. అగౌర‌వం: చాణక్యుడు ప్రతి సంబంధానికి ఒక విలువ‌, గౌరవం ఉంటుందని చెబుతారు. స్నేహానికి కూడా ఒక పరిమితి ఉంటుంద‌ని అంటారు. ప‌ర‌స్ప‌ర గౌర‌వాన్ని మ‌రచిపోయిన‌ప్పుడు వ్యక్తుల మ‌ధ్య స్నేహం విచ్ఛిన్నమవుతుంద‌ని చాణ‌క్య తెలియజేశారు.  

2. విలువ లేమి: ప్రతి సంబంధంలోనూ విలువ అంటూ ఉండ‌టం తప్పనిసరి అని చాణక్యుడు తెలిపారు. హుందాతనం అనేది స్నేహానికి కూడా వర్తిస్తుంది. స్నేహం అనేదానికి త‌గిన విలువ‌నివ్వాలి. విలువ‌లు క్షీణించిన‌ప్పుడు స్నేహం చెడిపోతుంది. దీనిని గుర్తుంచుకుని స్నేహితులు ప‌ర‌స్ప‌రం విలువ‌లు క‌లిగివుండాలని ఆచార్య చాణ‌క్య చెబుతారు. 

3. స్వార్థం: నిజ‌మైన స్నేహం అవ‌త‌లి వ్య‌క్తి నుంచి ఏదీ ఆశించ‌ద‌ని ఆచార్య చాణ‌క్య చెబుతారు. అప‌రిమిత‌మైన స్వార్థమే అన్ని సమస్యలకు మూలకారణం. దురాశ క‌లిగిన వ్యక్తి ప‌చ్చి స్వార్థపరుడ‌వుతాడు. స్వార్థపరునితో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే ప్రతి ఒక్కరూ దురాశకు దూరంగా ఉండాల‌ని చాణ‌క్య సూచించారు. 


4. అబద్ధాలు: అబ‌ద్ధాల ఆధారంగా ఏర్ప‌డిన ఏ సంబంధం కూడా ఎక్కువ కాలం నిల‌వ‌ద‌ని చాణక్య‌ చెబుతారు. స్నేహంలో అబద్ధాలకు స్థానం ఉండ‌కూడ‌దు. అబద్ధాల కారణంగా ఎవ‌రిమ‌ధ్య‌నైనా సంబంధాలు బలహీనంగా మారుతాయి. అందుకే అబద్దాలు చెప్పకూడద‌ని చాణ‌క్య హిత‌వు ప‌లికారు.

5. వంచన: చాణ‌క్య నీతి ప్రకారం మంచి స్నేహానికి పునాది నమ్మకం. నమ్మకం బలంగా ఉన్న‌ప్పుడు స్నేహ‌బంధం ధృఢంగా మారుతుంది. ప‌ర‌స్ప‌రం నమ్మకం అనేది లేకపోతే ఎంత‌టి స్నేహ‌మైనా ప‌త‌న‌మవుతుంది. వంచ‌న అనేది స్నేహాన్ని దెబ్బతీస్తుంది.

Updated Date - 2021-10-21T11:51:47+05:30 IST