చాణక్యనీతి: మీరు ఇలా ప్రవర్తిస్తే.. అందరూ మీకు స్నేహితులే!

ABN , First Publish Date - 2022-03-21T13:06:21+05:30 IST

చాణక్యుడు జీవిత తత్వశాస్త్రం తెలిసినవాడు. తన జీవితం..

చాణక్యనీతి: మీరు ఇలా ప్రవర్తిస్తే.. అందరూ మీకు స్నేహితులే!

చాణక్యుడు జీవిత తత్వశాస్త్రం తెలిసినవాడు. తన జీవితం నుండి గ్రహించిన అనుభవాల సారంతో కొన్ని నియమాలను రూపొందించడం ద్వారా, భవిష్యత్ తరాలకు చాణక్య నీతి అనే జ్ఞానాన్ని అందించాడు. దీనిలో అతను అనేక విధానాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. ఒకవేళ ఇబ్బంది వచ్చినట్లయితే దానిని సులభంగా తొలగించుకోగలుగుతాడు. మనుషుల ధోరణికి తగ్గట్టుగా ప్రవర్తించడం ద్వారా స్నేహపూర్వకంగా మెలగవచ్చు అని తెలిపిన ఆచార్య చాణక్యుని కొన్ని విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎదుటివారితో గొడవ పడకండి 

గొడవల ఫలితం ఎప్పుడూ మంచిది కాదు. మీరు ఎదుటివ్యక్తి ఆలోచన తీరును విభేదించవచ్చు. అటువంటి పరిస్థితిలో అతనితో ఓపెన్‌గా మాట్లాడండి. ఒక అంగీకారానికి రండి. మీరు కొంచెం సర్దుబాటు చేసుకుని, అతనిని కొంచెం సర్దుబాటు చేసుకోమని అడగండి. తద్వారా ఇద్దరూ తమ పనిని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు.


ఇతరుల స్వభావాన్ని అర్థం చేసుకోండి

మీకు ఎవరి సహాయం అవసరం అవుతుందో వారి ప్రవృత్తిని అర్థం చేసుకోండి. వారికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఎవరైనా తనను తాను బలవంతునిగా భావిస్తే, అతని బలం, కీర్తిని ప్రశంసించండి. అలా చేయడం వల్ల అతనికి వెంటనే ఉత్సాహం వస్తుంది. మీకు సహాయం చేయడానికి సిద్ధం అవుతాడు. 

అందరికీ గౌరవం ఇవ్వండి 

మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ గౌరవంగా చూసుకోండి. మీ తోటివారు మీ మాట వినాలని, వారు మీకు స్నేహితులుగా మారాలని మీరు కోరుకుంటే, మీరు కూడా వారి మాట వినాలి. పరస్పర గౌరవంతో స్నేహం పెరుగుతుంది. ఆలోచనల మార్పిడి ద్వారా వ్యక్తిగత అభివృద్ధి కూడా జరుగుతుంది.  

తప్పును అంగీకరించండి

మీరు తప్పు చేసినట్లయితే ఇతరుల ముందు మీ తప్పును అంగీకరించండి. తప్పును అంగీకరించడం ద్వారా ఎదుటి వ్యక్తికి మీపై ఉన్న కోపం వెంటనే చల్లారుతుంది. మీ పట్ల సానుభూతి పెరుగుతుంది. మీరు తప్పును అంగీకరించడం వల్ల ఎటువంటి నష్టం లేదని గ్రహించండి.  

Updated Date - 2022-03-21T13:06:21+05:30 IST