కొత్త ఫీచర్లతో Acer Smart టీవీలు..

ABN , First Publish Date - 2021-09-01T00:43:40+05:30 IST

కొత్త ఫీచర్లతో Acer Smart టీవీలు..

కొత్త ఫీచర్లతో Acer Smart టీవీలు..

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఏసర్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో ఏసర్ స్మార్ట్ టీవీ మోడల్స్ టీవీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్‌లో ఏసర్ స్మార్ట్ టీవీలను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏసర్ ఇండ్‌కాల్ టెక్నాలజీస్‌తో బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. ఏసర్ స్మార్ట్ టీవీలు 32-అంగుళాలు, 70-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటాయని సంస్థ తెలిపింది. ఏసర్ స్మార్ట్ టీవీల ధరలను మాత్రం సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఏసర్ తన రాబోయే టీవీ మోడళ్ల ఫీచర్‌లను షేర్ చేయలేదు. ఏసర్ టీవీల విడుదల తేదీని ప్రకటించలేదు. ఏసర్ బ్రాండ్-లైసెన్సీ ఇండ్కాల్ టెక్నాలజీస్ టీవీ మోడళ్లను తయారు చేస్తుందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-09-01T00:43:40+05:30 IST