బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-07-03T06:43:39+05:30 IST

చీరాల సెంటర్‌లో ఒక బంగారం షాపులో జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.రెండు లక్షల విలువైన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై దుర్గాప్రసాద్‌ తెలిపారు.

బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు
విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్సై దుర్గాప్రసాద్‌, స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు

తిరువూరు, జూలై 2: చీరాల సెంటర్‌లో ఒక బంగారం షాపులో జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.రెండు లక్షల విలువైన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై దుర్గాప్రసాద్‌  తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత నెల 29న చీరాల సెంటర్‌లోని జ్యోతి జ్యూయలరిషాపులో ఆభరణాలు అపహరించారు. షాపు యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఆర్‌.భీమరాజు ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. బస్‌స్టాండ్‌ సెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన గొర్రెల సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అపహరించిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. దర్యాప్తులో సెక్టార్‌-2 ఎస్సై పద్మారావు, ఏఎస్సైలు మల్లికార్జునరావు, వెంకటేశ్వరరావు, హెచ్‌సీలు ఎంకే బెగ్‌, షేక్‌ ఖాసీమ్‌బాబు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-03T06:43:39+05:30 IST