Abn logo
Sep 19 2021 @ 00:50AM

పక్కాగా ‘ప్రాదేశిక’ ఓట్ల లెక్కింపు

తామరంలో కేంద్రాన్ని పరిశీలిస్తున్న జేసీ వేణుగోపాల్‌రెడ్డి

 

  అధికారులకు జేసీ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశం 

మాకవరపాలెం మండలం తామరంలోని కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన 

అనుక్షణం అప్రమత్తం కావాలని సూచన

మాకవరపాలెం/గొలుగొండ/ నర్సీపట్నం అర్బన్‌, సెప్టెంబరు 18 : పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్కాగా సాగాలని జేసీ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. తామరం ఇమ్మాన్యుయల్‌ కళా శాలలో ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు కేం ద్రాన్ని శనివారం పరిశీలించి మాట్లా డారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లెక్కింపు మొత్తం వీడియో తీయాలని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్‌ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గట్టి బందో బస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ కృష్ణా రావుకు ఆదేశించారు. ఆర్డీవో రోణంకి గోవిందరావు, ఏఎస్పీ మణికంఠ చందోలు, ఎన్నికల ప్రత్యేకాధికారి శ్రీనివాసకుమార్‌, కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి, తహసీల్దార్‌ రాణి అమ్మాజీ, ఎంపీడీవో అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, గొలుగొండలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గోపీకుమార్‌ పరిశీలించారు. కౌంటింగ్‌ సమయంలో  సమస్యలు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌, ఈవోపీఆర్‌డీ రఘురాం తదిత రులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో  కౌంటింగ్‌కు సం బంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని మండల ఎన్నికల అధికారి ఎన్‌.సరోజిని తెలిపారు. పట్టణంలోని డాన్‌బాస్కో కళాశాలలో ఏర్పాట్లను ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. లెక్కింపులో అనుక్షణం అప్రమ త్తంగా ఉండాలన్నారు.