Abn logo
Aug 15 2020 @ 06:16AM

పక్కాగా భూ సర్వే ప్రక్రియ

ప్రత్యేక ఉప కలెక్టర్‌ సుందరి


భోగాపురం, ఆగస్టు 14:గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించి భూ సర్వే ప్రక్రియ పక్కాగా చేపడుతున్నట్టు ప్రత్యేక ఉప కలెక్టర్‌ కేబీటీ సుందరి  తెలిపారు. శుక్రవారం గూడెపువలసలో సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల సేకరించిన భూములను మరోసారి గుర్తించి హద్దులు నిర్ణయించనున్నట్టు చెప్పారు.


ఇలా గుర్తించిన భూములను ఎయిర్‌పోర్టు అఽథారిటీ ద్వారా జీఎంఆర్‌ సంస్థకు అప్పగిస్తామని తెలిపారు. గూడెపువలస, కవులవాడ, రావాడ, కొంగవానిపాలెం, కంచేరు, కంచేరుపాలెం, ఎరాయవలస, సవరవల్లి గ్రామాల్లో సర్వే చేస్తున్నట్టు వివరించారు. ఏపీడీసీఎల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సీహెచ్‌ రామకృష్ణ, జి.అప్పలనాయుడు, స్థానిక తహసీల్దారు రాజేశ్వరరావు, సర్వేయర్‌ వెంకటపతిరాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement