పక్కా పథకం ప్రకారమే!

ABN , First Publish Date - 2022-05-20T08:52:41+05:30 IST

రాష్ట్రంలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా తాటిపర్తి ఘటనలో తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో క్లూ దొరికింది. తన ప్రేమను అంగీకరించలేదని, తన తో పెళ్లికి

పక్కా పథకం ప్రకారమే!

కావ్యశ్రీని చంపడమే సురేష్‌ లక్ష్యం

బిహార్‌లో కొనుగోలు.. తాటిపర్తిలో కాల్పులు

గన్‌ విక్రయించిన ఇద్దరిలో ఒకరి అరెస్ట్‌


నెల్లూరు (క్రైం), మే 19: రాష్ట్రంలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా తాటిపర్తి ఘటనలో తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో క్లూ దొరికింది. తన ప్రేమను అంగీకరించలేదని, తన తో పెళ్లికి ఆమె కుటుంబ సభ్యు లూ ఒప్పుకోలేదన్న అక్కసుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అయిన కావ్యశ్రీని.. సమీప బంధువు సురే్‌షరెడ్డి ఈ నెల 9న తుపాకీతో కాల్చి చంపి, తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు తేలింది. ఈ కేసు వివరాలను నెల్లూరులో గురువారం అదనపు ఎస్పీ (క్రైం) చౌడేశ్వరి విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా తాటిపర్తికి చెందిన ఎం.సురే్‌షరెడ్డి (37) తనతో పెళ్లికి అంగీకరించలేదని కావ్యశ్రీని (24) అంతమొందించాలని పథక రచన చేశాడు. ఈ క్రమంలో లైసెన్స్‌ లేకుండా తుపాకీలు బిహార్‌లో దొరుకుతాయని తెలుసుకొని డిసెంబరులో పట్నాకు వెళ్లాడు. కందాస్‌ గ్రామంలో కారు డ్రైవర్‌ రమేశ్‌కుమార్‌ను కలిసి తుపాకీ కావాలని కోరాడు. అక్కడే 20 రోజులు ఉండి స్థానికంగా తయారుచేసిన తుపాకీని కొనుగోలు చేశాడు. ఎస్పీ  విజయరావు.. అసలు తుపాకీ ఎలా వచ్చింది.. ఎవరు విక్రయించారు..? ఇలా అనేక కోణాలపై దర్యాప్తు చేసేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సురే్‌షరెడ్డికి చెందిన సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ పరకరాలలో లభ్యమైన సమాచారంతో ఘటన జరిగిన మరుసటి రోజే ప్రత్యేక బృందాలు బిహార్‌లోని పట్నాకు చేరుకున్నాయి. బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బెవూర్‌ పోలీసులను కలిసి నిందితుల్లో ఒక్కడైన రమే్‌షను విచారణ కోసం నెల్లూరుకు రావాలని తెలిపారు. ఈ నెల 17, 18 తేదీలలో దర్యాప్తు అధికారి ముందు రమేష్‌ హాజరవగా గురువారం నిందితుడిని సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌లో అరెస్ట్‌ చేశారు.  

Updated Date - 2022-05-20T08:52:41+05:30 IST