యాక్సిడెంట్స్‌, ట్రాఫిక్‌ జామ్స్‌నూ ‘యాపిల్‌’ చెప్పేస్తుంది

ABN , First Publish Date - 2021-02-20T06:23:35+05:30 IST

యాపిల్‌ మ్యాప్‌లో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ప్రమాదాలు, అపాయాలు, స్పీడ్‌ చెక్స్‌ రిపోర్ట్‌ చేసే సదుపాయాన్ని యాపిల్‌ తన మ్యాప్‌లో వినియోగదారులకు అందిస్తోంది

యాక్సిడెంట్స్‌, ట్రాఫిక్‌ జామ్స్‌నూ ‘యాపిల్‌’ చెప్పేస్తుంది

యాపిల్‌ మ్యాప్‌లో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ప్రమాదాలు, అపాయాలు, స్పీడ్‌ చెక్స్‌ రిపోర్ట్‌ చేసే సదుపాయాన్ని యాపిల్‌ తన మ్యాప్‌లో  వినియోగదారులకు అందిస్తోంది. ఐఔస్‌ 14.5 అప్‌డేట్‌లో భాగంగా ఈ సౌలభ్యాన్ని అందిస్తోంది. పబ్లిక్‌ బేటా టెస్టర్లు, డెవలపర్లకు అందుబాటులో ఉంటుందని ‘మేక్‌రూమర్స్‌’ తెలిపింది. 


ఇందులో వినియోగదారుడు మొుదట డెస్టినేషన్‌ అడ్రస్‌ తెలియజేసి, రూట్‌ని సెలెక్ట్‌ చేసుకుని ‘గో’ని కొడితే  ఆ దారిలో ప్రమాదాలు, అపాయాలను తదితరాలను ‘సిరి’ రిపోర్ట్‌ చెబుతుంది. కొత్తగా ‘రిపోర్ట్‌’ అనే బటన్‌ ఉంటుంది. దానిని ప్రెస్‌ చేయడం ద్వారా ఇన్సిడెంట్‌ను రిపోర్ట్‌ చేయవచ్చు.  దీనిని వెంటనే ‘సిరి’ యాపిల్‌ మ్యాప్స్‌కు పంపుతుంది. తగు సంఖ్యలో యూజర్లు అదే విషయాన్ని రిపోర్ట్‌ చేసిన పక్షంలో క్రౌడ్‌ సోర్సింగ్‌ సహాయంతో ‘యాపిల్‌ మ్యాప్స్‌’ ఇతరులకు ఆ సమాచారాన్ని తెలియజేస్తుంది.  ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ దశలో ఉంది. అమెరికాలో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే దీనిని అందిస్తున్నారు.  తర్వాత కొద్దికాలంలో ఇతర దేశాల్లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చే 

Read more