ట్రాఫిక్‌ నిబంధనలతోనే ప్రమాదాల నివారణ

ABN , First Publish Date - 2021-01-19T05:53:21+05:30 IST

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు. జిల్లాలో 32వ రహదారి భద్రతా మాసోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17వరకు నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ట్రాఫిక్‌ నిబంధనలతోనే ప్రమాదాల నివారణ
రహదారి భద్రత పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

కలెక్టర్‌ నివాస్‌ 

రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం

కలెక్టరేట్‌, జనవరి 18: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు. జిల్లాలో 32వ రహదారి భద్రతా మాసోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17వరకు నెల రోజుల పాటు  రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటో, ట్రక్‌ డ్రైవర్లు, ముఖ్యంగా యువతకు రహదారి భద్రతపై అవగాహన ఉండాలని హితవు పలికారు. జిల్లాలో 120 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని, ఈ పరిధిలో ఎలాంటి  ప్రాణనష్టం జరగకూడదని కలెక్టర్‌ అన్నారు. రవాణా శాఖ ఉపకమిషనర్‌ సుందర్‌ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోయే పరిస్థితులు రాకూడదన్నారు. ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన  కల్పించాల్సి ఉందని చెప్పారు. కార్యక్రమంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.వేణుగోపాలరావు,  ప్రసాదరెడ్డి, సాయిరామ్‌, శశి, పి.శివరాంప్రసాద్‌ పాల్గొన్నారు. 


రహదారి భద్రతే జీవితానికి రక్ష :  ఎస్పీ అమిత్‌బర్దర్‌ 


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 18: రహదారి భద్రతే జీవితానికి రక్ష అని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఎస్పీ సోమవారం ప్రారంభించారు. ముందుగా రవాణా శాఖ అధికారులతో కలసి వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, కుటుంబంలో ఒక ప్రధాన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం ఆదరణ కోల్పోతుందన్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హెల్మెట్‌, సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని హెచ్చరించారు. అనంతరం నగరంలో బైక్‌ ర్యాలీని జెండా ఊపి ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సోమశేఖర్‌, క్రైం ఏఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ మహేంద్ర, ఆర్టీసీ డీసీటీఎం వరలక్ష్మి, ఆటోడ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:53:21+05:30 IST