రోడ్డెక్కితే ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-07T06:05:08+05:30 IST

ఎమ్మిగనూరు-కోడుమూరు రహదారి ఏడాది క్రితం శిథిలావస్థకు చేరింది.

రోడ్డెక్కితే ప్రమాదం
ఎమ్మిగనూరు - కోడుమూరు ప్రధాన రహదారిలో పడ్డ గుంతలు

  1. గుంతలు పడ్డ ఎమ్మిగనూరు-కోడుమూరు రోడ్డు
  2. రెండు వారాల్లో ఒకరి మృతి, పలువురికి గాయాలు


గోనెగండ్ల, డిసెంబరు 6: ఎమ్మిగనూరు-కోడుమూరు రహదారి ఏడాది క్రితం శిథిలావస్థకు చేరింది. ఈ దారిలో రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చీకటి పడ్డాక ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకి చెందిన దంపతులు శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో మంత్రాలయానికి వెళ్లి తిరుగుప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. వాహనం అదుపుతప్పి కింద పడటంతో మహిళ మృతి చెందారు. మూడు రోజుల క్రితం పుట్టపాశం-వేముగోడు మధ్య ఉల్లి గడ్డల లారీ గుంతను తప్పించబోయి బోల్తా పడింది. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పది రోజుల క్రితం గోనెగండ్ల టీడీపీ నాయకుడు చెన్నల రాయుడు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల క్రితం గోనెగండ్ల సమీపంలో వరి దిగుబడులతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఇలా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

Updated Date - 2021-12-07T06:05:08+05:30 IST