అశ్వారావుపేట రూరల్, మార్చి 31: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన అశ్వారావుపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది. పట్టణంలోని డ్రైవర్స్‌కాలనీకి చెందిన ఎం.నాగేశ్వరావు(70)కు రెండు కాళ్లు పడిపోవటంతో రోడ్డుపై పాకుకుంటూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఇదే తరుణంలో రింగ్‌రోడ్ సెంటర్లో నాగేశ్వరరావు రోడ్డును దాటుతున్న క్రమంలో అశ్వారావుపేట నుంచి కొత్తగూడెం వెళుతున్న బస్ ఢీకొంది. దీంతో నాగేశ్వరరావు తలకు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే నాగేశ్వరరావు మృతిచెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.