నిమిషం గడిస్తే ప్రాణాలు దక్కేవి..

ABN , First Publish Date - 2021-04-09T06:00:39+05:30 IST

నిమిషం గడిస్తే ప్రాణాలు దక్కేవి..

నిమిషం గడిస్తే ప్రాణాలు దక్కేవి..

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఆరో గనిలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంతో సింగరేణి కార్మికులు శోక సంద్రంలో మునిగిపోయారు.చూస్తూ చూ స్తుండగానే తోటి కార్మికులు మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిమిషం గడిస్తే వారి ప్రాణా లు దక్కేవని సంఘటన తీరుపై చర్చించుకుంటున్నారు. మరో వైపు ఈ ప్రమాదానికి సింగరేణి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా డ్యూటీలు కేటాయించి ఇద్దరు కార్మికుల మృతికి కారకులలయ్యారని అంటున్నారు. 

ఏం జరిగిందంటే..

ఎప్పటిలాగే సెకండ్‌ షిఫ్టులో గనిలోని 11.5 లెవల్‌, 3సీం వద్ద సపోర్టర్స్‌గా ముగ్గురు కార్మికులు విధులకు వెళ్లారు. భూ ఉపరితలం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూ రంలో వీరు డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు. అప్పటికే 3సీం వ ద్ద పైకప్పు గోడ కూలేందుకు సిద్ధంగా ఉండగా సర్దార్‌ న ర్సింగరావుతో కలిసి సపోర్టుమన్లు నర్సయ్య, శంకరయ్య మ రమ్మతులు చేపట్టారు. మూడు వైపులా కర్రలు, మొద్దుల ను సపోర్టుగా పెట్టి బిగించినట్టు సమాచారం. ఇక రూఫ్‌కు నాలుగో వైపు కూడా మొద్దులు, కర్రలను సపొర్టుగా పెట్టి  బిగిస్తున్న క్రమంలోనే ఒక్కసారి అది కూలిపోయిందని ఈ ఘటనలో గాయపడిన సర్దార్‌ నర్సింగరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎలాంటి శబ్దం లేకుండా క్షణాల్లో మట్టి పెళ్లలు విరిగి పడటంతో ఇద్దరు కార్మికులు మట్టి శిథిలాల మధ్య ఇరుక్కపోయారు. వెంటనే తెరుకున్న నర్సింగరావు వారిని కాపాడేందకు ప్రయత్నించారు. మట్టి పెళ్లల మధ్య ఇద్దరు కార్మికుల నుంచి శంకరయ్య, నర్సయ్య మూలుగుతున్న శ బ్దం వినిపించింది. అప్పటి వరకు ప్రాణాలతో ఉన్నారని భా వించి మట్టి పెళ్లలను పక్కకు తొలిగిస్తుండగా మరోసారి రూఫ్‌ పైనుంచి మట్టి, రాళ్లు పెద్ద ఎత్తున కూలి పడ్డాయి. ఆ శిథిలాల్లో ఉన్న కార్మికులు మృతి చెందారు. కార్మికులను రక్షించేందుకు ప్రయత్నించిన నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక నిమిషంలో రూఫ్‌కు నాలుగో వైపు కూడా సపొర్టుగా మొద్దులు, కర్రల బిగింపు పూర్తయ్యేదని, దీంతో ప్రమాదం జరిగేది కాదని నర్సింగరావు తెలిపారు. మరో ని మిషం గడిస్తే గండం గట్టేక్కేదని, కార్మికులు ప్రాణాలతో బ యట పడేవారని తోటి కార్మికులు అంటున్నారు. 

ముందే తెలిసినా.. 

గనిలో 11.5 లెవల్‌ 3సీం వద్ద రూఫ్‌ పరిస్థితి బాగా లేదని ముందే తెలిసినా అధికారులు కార్మికులను డ్యూటీకి పంపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే చోట మొదటి షిఫ్టులో ఒవర్‌మన్‌గా పని చేసిన వెంకటేశ్వర్‌రావు తన డ్యూటీ ముగించుకొని వెళ్తున్న క్రమంలో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. 3సీం వద్ద రూఫ్‌ పోజిషన్‌ బాగా లేదని, ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చని ఆయన చెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ సెకండ్‌ షిఫ్టులో సర్దార్‌ నర్సింగరావు, హెడ్‌ ఒవర్‌మన్‌ మనోజ్‌కుమార్‌తో పాటు సపొర్టుమెన్లు శంకరయ్య, నర్సయ్యకు డ్యూటీ వేశారు. కనీసం అక్కడ ఉన్న క్లిష్ట పరిస్థితిపై కూడా హెచ్చరించకుండా అధికారులు వారిని విధులకు పంపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రూఫ్‌ పరిస్థితిపై అవగాహన లేకుండా విధుల్లో నిమగ్నమైన సపొర్టుమన్లు ప్రమాదానికి గురయ్యారనే వాదన వినిపిస్తోంది. ముందే అధికారులు హెచ్చరిస్తే కొంత జాగ్రత్తగా విధులు నిర్వహించేవారనే కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై ముందే ఊహించిన హెడ్‌ ఒవర్‌మెన్‌ మనోజ్‌కుమార్‌ సింగరేణి అధికారులకు మొర పెట్టుకున్నారు. జనవరి 5న 11.5 లెవల్‌ 3సీం వద్ద రూఫ్‌ ప్రమాదకరంగా ఉందని, పనికి అనుమతి ఇవ్వొద్దని చెప్పారు. ఫినిషింగ్‌ చేసి  3సీంను మూసివేయాలని కోరారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా దాటవేశారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగానే బుధవారం ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమే అని అంటున్నారు. మరోవైపు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. బాధిత కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సింగరేణి అధికారులు మాత్రం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు.


Updated Date - 2021-04-09T06:00:39+05:30 IST