శంకుస్థాపనకు వెళ్తూ మృత్యులోకాలకు

ABN , First Publish Date - 2021-05-14T08:43:14+05:30 IST

డ్రైవర్‌ నిద్ర మత్తు నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది. శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన మాతా శ్రీనివాస్‌

శంకుస్థాపనకు వెళ్తూ మృత్యులోకాలకు

పెద్దాపురం ఏడీబీ రహదారిలో టిప్పర్‌ని ఢీ కొట్టిన కారు... నలుగురి మృతి

పెద్దాపురం, మే 13: డ్రైవర్‌ నిద్ర మత్తు నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది. శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన మాతా శ్రీనివాస్‌ మైనింగ్‌ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా రాజమహేంద్రవరంలో పని చేస్తున్నాడు. రాజమహేంద్రవరంలో తాను నిర్మించనున్న ఇంటి శంకుస్థాపన ఏర్పాట్ల కోసం శ్రీనివాస్‌ ముందుగానే రాజమహేంద్రవరం వెళ్లాడు. అలాగే, ఆయన కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ కార్యక్రమానికి బయల్దేరారు. 4.30 గంటలు దాటిన తర్వాత పెద్దాపురం- సామర్లకోట ఏడీబీ రహదారిలో రుచి సోయా పరిశ్రమ వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్‌ మామ అరదాడి స్వామి(55), అక్క వనమాడి అన్నపూర్ణ(33), బావ వనమాడి ఈశ్వరరావు(36), ఐదు నెలల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందారు. భార్య రామలక్ష్మి, తల్లి లక్ష్మి, తండ్రి కృష్ణ, అత్త అరదాడి బేబీ, కారు డ్రైవర్‌ వింత జ్యోతికుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

Updated Date - 2021-05-14T08:43:14+05:30 IST