Abn logo
Oct 17 2021 @ 08:12AM

Khammam జిల్లా ముదిగొండలో ఘోర ప్రమాదం

ఖమ్మం : జిల్లాలోని ముదిగొండ మండలం బాణాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో పండగపూట విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...