స్నేహితుల దినోత్సవాన హైదరాబాద్‌లో విషాదం

ABN , First Publish Date - 2021-08-02T21:18:40+05:30 IST

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహితుల దినోత్సవాన అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కెనడాలో ఎంటెక్ చదువుతున్న ఆశ్రిత కన్నుమూసింది. మరో ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

స్నేహితుల దినోత్సవాన హైదరాబాద్‌లో విషాదం

హైదరాబాద్: స్నేహితుల దినోత్సవాన హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కెనడాలో ఎంటెక్ చదువుతున్న ఆశ్రిత కన్నుమూసింది. మరో ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఫ్రెండ్‌షిప్‌డే సెలబ్రేషన్స్ కోసం అభిషేక్,సత్య ప్రకాష్, తరుణీ, ఆశ్రిత కొండాపూర్‌ పబ్‌కి వెళ్లారు. పార్టీ తర్వాత స్కోడా కారులో వెళ్తుండగా కొండాపూర్ మై హోమ్ మంగళ వద్ద ప్రమాదం జరిగింది. అభిషేక్ మితిమీరిన వేగంతో కారును నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీ కొట్టింది. కారు పల్టీ కొట్టి వెనక డోర్ తెరుచుకోవడంతో కారులో నుంచి కింద పడిపోయి తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆశ్రిత చనిపోయింది. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు గచ్చిబౌలి సీఐ తెలిపారు. 

Updated Date - 2021-08-02T21:18:40+05:30 IST