బస్సు, ఆటో ఢీ.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-09-29T05:27:09+05:30 IST

మండల పరిధి అనంతవరప్పాడు ఎస్సీ కాలనీ మలుపులో మంగళవారం ఉదయం స్కూల్‌ బస్సు, కూలీల ఆటో ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు, ఆటో ఢీ.. ఒకరి మృతి
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యేకిలారివెంకటరోశయ్య

ఆరుగురు కూలీలకు తీవ్రగాయాలు

వట్టిచెరుకూరు, సెప్టెంబరు 28: మండల పరిధి అనంతవరప్పాడు ఎస్సీ కాలనీ మలుపులో మంగళవారం ఉదయం స్కూల్‌ బస్సు, కూలీల ఆటో ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు  తీవ్రంగా గాయపడ్డారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు  వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామంలోని మిరపతోటలో పని చేసేందుకు ఆటో వస్తున్నారు.  ఈ క్రమంలో ఎస్సీ కాలనీ వద్ద మలుపు తిరిగే సమయంలో స్కూల్‌ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఆటో నుజ్జునుజ్జు కాగా ఆటోలోని మారిబోయిన లక్ష్మీ, మంగిబోలు వీరమ్మ, దోనేపల్లి సాంబ్రాజ్యం, ఈగ అనురాధ, తెల్లాకుల నాగేశ్వరమ్మ, చిట్టేటి కాశమ్మ, చేపల పార్వతి తీవ్రంగా పడ్డారు. ఎస్‌ఐ మహేంద్ర, రైటర్‌ మల్లేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని 108 ద్వారా గాయపడిన కూలీలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మారిబోయిన లక్ష్మీ(47) మృతి చెందింది. పాఠశాల బస్సులోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదని ఎస్‌ఐ మహేంద్ర తెలిపారు. 

మెరుగైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే 

పొన్నూరు: ఆటో పాఠశాల బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడి జీజీహెచలో చికిత్స పొందుతున్న కూలీలను    ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్‌ఎంవోను  ఆదే శించారు. మృతి చెందిన కుటుంబసభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.

 

Updated Date - 2021-09-29T05:27:09+05:30 IST