పెంబి, మార్చి 7 : మండలంలోని మందపల్లి కస్తూర్బా గాంధీ విద్యాల యంలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చే శారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అసిస్టెంట్ కుక్ పోస్టు కోసం ఓసీ (ఉమెన్), ఏడోతరగతి ఉత్తీ ర్ణులై ఉండాలన్నారు. డే నైట్ వాచ్‌మెన్ పోస్టు కోసం పదోతరగతి ఉత్తీర్ణులై ఉండి 18 ఏళ్లు నిండి ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు మండల సీఆ ర్‌పీ విఠల్ ఫోన్ నెంబరు 81066 95385 సంప్రదించాలని పేర్కొన్నారు.