Abn logo
Sep 20 2021 @ 23:20PM

డీఈవో సత్యసుధ బాధ్యతల స్వీకారం

కలెక్టరేట్‌, సెప్టెంబరు 20: జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.సత్యసుధ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టర్‌ సూర్యకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది నూతన డీఈవోకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె గుంటూరు ఆర్‌జేడీ కార్యాలయంలో  సహాయ సంచాలకులుగా పనిచేశారు. పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఈవో నాగమణి పదోన్నతిపై జేడీగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు  ఇన్‌చార్జి బాధ్యతలను ఏడీ లక్ష్మణరావు చూశారు. ఆయన నుంచి సత్యసుధ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.