ఊపందుకున్న వరి కోతలు

ABN , First Publish Date - 2021-10-25T04:05:31+05:30 IST

జిల్లాలో వానాకాలం సీజన్‌ వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ భూముల్లో సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన పంటలను కోసేం దుకు రైతులు బీజీ అయ్యారు.

ఊపందుకున్న వరి కోతలు

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న రైతులు
ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేక రోడ్లపైనే ధాన్యం కుప్పలు
జిల్లాలో మొత్తం 343 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఇప్పటికే 28 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మరో వారం రోజుల్లో కేంద్రాలకు పెద్దమొత్తంలో చేరుకోనున్న ధాన్యం
జిల్లాలో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
ఇప్పటికే 12 వందల  మెట్రిక్‌ టన్నులు కొనుగోలు


కామారెడ్డి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం సీజన్‌ వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ భూముల్లో సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన పంటలను కోసేం దుకు రైతులు బీజీ అయ్యారు. ఇప్పటికే కొందరు రైతులు వరి కోతలను ప్రారంభించారు. కోత మిషన్‌లు సైతం గ్రామాల్లోని పం ట పొలాలకు చేరుకున్నాయి. వరి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్‌లో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యం గా పెట్టుకున్నారు. కోతలు మొదలైనందున ఇప్పటికే జిల్లా లో 28 కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఇప్పుడిప్పుడే వరి కోతలను మొదలు పెట్టడంతో వారం రోజుల్లోగా కొనుగోలు కేంద్రాలకు పెద్దమొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు భావి స్తున్నారు. అప్పటిలోగా కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

కొనుగోలు లక్ష్యం 6 లక్షల మెట్రిక్‌ టన్నులు
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగానే రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌, కాలు వ దిగువన నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రూల్లాబాద్‌, పోచారం ప్రాజెక్ట్‌ కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతో పాటు కామారెడ్డి, దోమకొండ, లింగంపేట తది తర మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో రెండు లక్షల ఎకరాలకు పైగా పంట లు సాగు కావడం ఇదే మొదటిసారి. ఈ లెక్కన 6.80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగు బడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉందని పౌరసర ఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సన్నరకం ధాన్యం 2లక్షల మెట్రి క్‌ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు రానుందని అంచనా వేశారు.

343 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ఈ వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 343 కేంద్రా లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 312 పీఏసీఎస్‌లు, 21 ఐకేపీ, 10 మార్కెటింగ్‌ కమిటీ ల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి ధాన్యం సేకరణకు 1.50 లక్షల గన్నీ బ్యాగు లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే 90 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు అవసర మైన ప్యాడి క్లీనర్‌, తేమశాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ కాంటలు, గన్నీ సంచులు సిద్ధం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో గతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లుల కు తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ ఇబ్బందులు తలెత్తడంతో ఈ అనుభావా లను దృష్టిలో పెట్టుకుని ఏడాది నుంచి ధాన్యాన్ని తరలించేందుకు క్లస్టర్‌ లుగా విభజించారు. ఈ వానాకాలం సీజన్‌లో 7 క్లస్టర్‌లుగా విభజించి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా మిల్లులకు ధాన్యాన్ని తరలించనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో 165 రైస్‌ మిల్లులకు కేటాయించారు.
మద్దతు ధరకే కొనుగోలు
ఈ సీజన్‌లో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వాలు మద్దతు ధరను ప్రకటించాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాళ్లకురూ.1,960, బీ గ్రేడ్‌ క్వింటాలుకు రూ.1,940 చెల్లించి  ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. 17 శాతం తేమ ఉన్న వడ్లనే కొనుగోలు చేయనున్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేం దుకు ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధరకే వరి ధాన్యాన్ని నేరుగా ప్రభు త్వం కొనుగోలు చేయనుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 28 కేంద్రాల్లోని 12 వందల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ జితేందర్‌ తెలిపారు.

Updated Date - 2021-10-25T04:05:31+05:30 IST