భూ రికార్డుల స్వచ్ఛీకరణ వేగవంతం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-24T07:10:52+05:30 IST

జిల్లాలో భూరికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.

భూ రికార్డుల స్వచ్ఛీకరణ వేగవంతం : కలెక్టర్‌
వీడీయో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మే 23: జిల్లాలో భూరికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియను వేగవంతం  చేయాలని కలెక్టర్‌  హరినారాయణన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి మండల, డివిజనల్‌, జిల్లా స్థాయి అధికారులతో భూ సర్వే అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఒరిజనల్‌, రీ సెటిల్‌మెంట్‌ రికార్డులను వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న రికార్డులతో సరి చూసుకుని నిర్దేశించిన ప్రొఫార్మాలో సమోదు చేయాలన్నారు. ఇంతవరకు 118 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే జరగ్గా వాటిలో 31 గ్రామాలకు సంబంధించిన వివరాల షీట్స్‌  అందాల్సి ఉందని చెప్పారు. జిల్లా అంతటా జగనన్న ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే ఇంకా 9,377 గృహాలకు పునాదిరాళ్లు పడకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. 72,272 గృహాలు మంజూరు కాగా 51,594 నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్‌ సంబధిత  శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతి పంచాయతీలో వంద మందికి మించి ఉపాధి పనులు కల్పించండి : కలెక్టర్‌

ప్రతిగ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న వారి కంటే అదనంగా వందమందికి మించి కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్‌ హ రినారాయణన్‌ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక ్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాన్ని అధిగమించా లన్నారు. జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్వో రాజశేఖర్‌, డ్యామా, డీఆర్‌డీఏ, హౌసింగ్‌ పీడీలు చంద్రశేఖర్‌, తులపి, పద్మనాభం, సీపీవో ఉమాదేవి, పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రె డ్డి, బీపీవో దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T07:10:52+05:30 IST