Abn logo
Sep 25 2021 @ 00:59AM

గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి

మెగా లేఅవుట్‌లో నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జేసీ కల్పనాకుమారి

హౌసింగ్‌ జేసీ కల్పనాకుమారి


కొత్తూరు, సెప్టెంబరు 24: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్‌ జేసీ కల్పనాకుమారి ఆదేశించారు. తగరంపూడి, మెట్టపాలెం, సత్యనారాయణపురం గ్రామాల్లో శుక్రవారం గృహ నిర్మాణ లేఅవుట్లను పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని వివరించాలన్నారు. ఇకపై నిర్మాణ పనులు తరచూ పరిశీలిచడంతో పాటు ప్రగతిని సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఆమె వెంట తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, సర్వేయర్‌ శ్రీరామ్మూర్తి, పలు విభాగాల ప్రతినిధులు కోరుకొండ కిరణ్‌, శ్రావణి, లీల, ప్రసాదరావు పాల్గొన్నారు.