ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-12-08T05:50:33+05:30 IST

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను అదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 7: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను అదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 31,974 మంది రైతుల నుంచి లక్షా 87 వేల 147 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లక్షా 78 వేల 859 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు తరలించడం జరిగిందని అన్నారు. మిగులు ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు కొనుగోలు ఎక్కువగా జరుగుతున్న కేంద్రాలకు రవాణా కోసం అదనపు వాహానాలను పంపించాలని అన్నారు. రూ 366.81 లక్షల విలువైన ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేసి 18315 మంది రైతులకు రూ 207. 56 లక్షల వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. 23311 మంది రైతుల వివరాలు అన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన రైతుల వివరాలను అన్‌లైన్‌లో త్వరితగతిన నమోదు చేసి ధాన్యం డబ్బులను త్వరగా అందించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు పక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్‌ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మేనేజర్‌ హారికృష్ణ, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, డీటీవో కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T05:50:33+05:30 IST