ధాన్యం సేకరణను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-05-18T05:11:24+05:30 IST

అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు.

ధాన్యం సేకరణను వేగవంతం చేయండి
జోగిపేటలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

 అదనపు కలెక్టర్ల ఆదేశాలు


సంగారెడ్డి రూరల్‌/జోగిపేట/పుల్‌కల్‌, మే. 17: అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి మంగళవారం డీఆర్డీవో, డీపీవో, పౌరసరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. టెలికాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో శ్రీనివా్‌సరావు పాల్గొన్నారు. అలాగే జోగిపేట మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని, చౌటకూర్‌ మండలం శివంపేటలోని కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైస్‌ మిల్లర్లు ధాన్యం లారీలను సకాలంలో అన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలని సంబంధిత అఽధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి వెంట వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని స్పష్టం చేశారు. ధాన్యం తరలింపు కోసం అదనంగా వాహనాలు అవసరమైతే సమకూర్చుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు  ఇబ్బంది పడకుండా చూడాలని పేర్కొన్నారు. ఆయనవెంట అందోలు పీఏసీఎస్‌ సీఈవో నర్సింహులు, వీఆర్‌ఏ బైండ్ల రమేష్‌, చౌటకూరు ఎంపీడీవో మధులత ఉన్నారు.


రూ.15 కోట్లు రైతుల ఖాతాలో జమ 


వెల్దుర్తి/శివ్వంపేట, మే. 17: మెదక్‌ జిల్లా వెల్దుర్తిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. శివ్వంపేట మండలంలోని గోమారం, చిన్నగొట్టిముక్ల, శివ్వంపేటలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మెదక్‌ జిల్లాలో రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు రూ.15 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు అదనపు కలెక్టర్‌ రమేష్‌ తెలిపారు. రైతుల ధాన్యం తడవకుండా జిల్లాలో 15 వేల టార్ఫాలిన్‌ కవర్లను పంపిణీ చేశామన్నారు. జూన్‌ 5 వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పండించినట్లు తమ అంచనాలో తేలిందని, ఇప్పటి వరకు 1.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ రమే్‌షగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అనంతరెడ్డి, తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌, ఎంపీడీవో జగదీశ్వరాచారి, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. శివంపేటలో ఆయన వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సచారి, నాయకులు మాదవరెడ్డి ఉన్నారు.


 

Updated Date - 2022-05-18T05:11:24+05:30 IST