Abn logo
May 17 2021 @ 00:04AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

 - మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- అధికారులతో కలిసి అప్పన్నపల్లి ఫ్లై ఓవర్‌, జంక్షన్‌ పనుల పరిశీలన

మహబూబ్‌నగర్‌, మే 16 : పాలమూరులో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయా లని ఆబ్కారీశాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం అప్పన్న పల్లి రైల్వే ఓవర్‌బ్రిడ్జి, పట్టణంలో చేపడుతున్న జంక్షన్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృ ద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూసు కోవాలన్నారు. తెలంగాణ చౌరస్తాలో రహదారుల పై చిన్న ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలని, కోర్టు కు వెళ్లే రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. జంక్షన్‌ పనులు ఇప్పటికే కొన్ని పూర్తికాగా క్లాక్‌టవర్‌, అశోక్‌ థియేటర్‌ జంక్షన్‌లో పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అప్పన్నపల్లి రెండో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీ లించిన మంత్రి మాట్లాడుతూ గతంలో చేపట్టిన ఫ్లై ఓవర్‌ పనులు 12 ఏళ్లు నిర్మించారని, ఇప్పుడు అలాకాకుండా 12 నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లాక్‌డౌన్‌ సమయం లోనూ పనుల్లో జాప్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడిష నల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ ర్సింహులు పాల్గొన్నారు.

Advertisement