హౌసింగ్‌ లేఅవుట్లలో నిర్మాణాల వేగం పెంచండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-24T07:26:48+05:30 IST

జగనన్న హౌసింగ్‌ లేఅవుట్లలో రోజువారీ నిర్మాణాల పురోగతి ఉండాలని అఽధికారులను కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు.

హౌసింగ్‌ లేఅవుట్లలో నిర్మాణాల వేగం పెంచండి: కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుపతి(రవాణా), మే 23: జగనన్న హౌసింగ్‌ లేఅవుట్లలో రోజువారీ నిర్మాణాల పురోగతి ఉండాలని అఽధికారులను కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. సోమవారం గృహనిర్మాణాలు, ఓటీఎస్‌, స్వచ్ఛసంకల్పం, ప్రభుత్వ భవన నిర్మాణాలు, జల్‌జీవన్‌ కమిషన్‌, ఉపాధిహామీ పనులపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి బేస్‌ లెవల్లో ఉన్న దాదాపు 12వేల నిర్మాణాలను రూఫ్‌ లెవల్‌కు తీసుకొచ్చి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. స్వచ్ఛ సంకల్పం ఎస్‌డబ్ల్యూపీసీలలో వర్మి కంపోస్టు తయారీపై దృష్టి పెట్టాలన్నారు. వీటిని ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు పర్యవేక్షించాలని చెప్పారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటి తాగునీటి కొళాయిలు అందించాలన్నారు. ఉపాధిపనుల లక్ష్యాలను పూర్తిచేసి, పనిదినాలను పెంచాలని సూచించారు. డీఆర్వో శ్రీనివాసరావు, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T07:26:48+05:30 IST