Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 16 May 2022 00:55:54 IST

అదానీ చేతికి ఏసీసీ, అంబుజా సిమెంట్‌

twitter-iconwatsapp-iconfb-icon

డీల్‌ విలువ రూ.81,360 కోట్లు 26% వాటా కోసం త్వరలో ఓపెన్‌ ఆఫర్‌


హోల్సిమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అదానీ గ్రూప్‌ 

భారత సిమెంట్‌ రంగంలో ఇదే భారీ డీల్‌ 

దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా అవతరణ


న్యూఢిల్లీ: భారత కార్పొరేట్‌ రంగంలో అతిపెద్ద టేకోవర్‌ చోటు చేసుకుంది. భారత్‌లో దిగ్గజ సిమెంట్‌ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌ గూటికి చేరనున్నాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ లిమిటెడ్‌కు ఉన్న మెజారిటీ వాటాను అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌తో కలిపి 1,050 కోట్ల డాలర్లకు (సుమారు రూ.81,360 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ మేరకు హోల్సిమ్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. భారత సిమెంట్‌ రంగంలోనే కాకుండా భారత కార్పొరేట్‌ రంగంలోనే దీన్ని అతిపెద్ద కొనుగోలుగా భావిస్తున్నారు. హోల్సిమ్‌ కంపెనీకి అంబుజా సిమెంట్‌ ఈక్విటీలో 63.19 శాతం, ఏసీసీ ఈక్విటీలో 54.53 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటా మొత్తం అదానీ గ్రూప్‌ పరం కానుంది. 


 త్వరలో ఓపెన్‌ ఆఫర్‌ 

డీల్‌లో భాగంగా ఒక్కో అంబుజా సిమెంట్‌ ఈక్విటీ షేరును రూ.385, ఏసీసీ షేరును రూ.2,300 చొప్పున అదానీ గ్రూప్‌ కొనుగోలు చేస్తోందని హోల్సిమ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదే ధరకు ఈ రెండు కంపెనీల ఈక్విటీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్‌ త్వరలో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. అదానీ గ్రూప్‌ ఇంత భారీ మొత్తం పెట్టి ఒక కంపెనీని కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. కాగా సిమెంట్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్‌ ఈ మధ్యనే అదానీ సిమెంట్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీని కూడా ఏర్పాటు చేసింది. 


దిగ్గజాలను కాదని..

అలా్ట్రటెక్‌, జెఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ కూడా ఏసీసీ, అంబుజా సిమెంట్‌లో హోల్సిమ్‌ వాటా కొనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి. అయితే అత్యధిక ధర కోట్‌ చేయడం ద్వారా అదానీ గ్రూప్‌ ఈ రెండు సిమెంట్‌ కంపెనీలను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలుతో దేశ సిమెంట్‌ ఉత్పత్తిలో అదానీ గ్రూప్‌ రెండో అతిపెద్ద గ్రూప్‌ కానుంది. ప్రస్తుతం ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీల వార్షిక సిమెంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం 6.6 కోట్ల టన్నులు. అలా్ట్రటెక్‌కు తప్ప మరే కంపెనీకి ఇంత ఉత్పత్తి సామర్ధ్యం లేదు. అదానీల ప్రవేశంతో దేశ సిమెంట్‌ రంగంలో పోటీ మరింత ఉధృతం అవుతుందని భావిస్తున్నారు. 


 ప్రత్యేకతలు.. 

ఏసీసీ కంపెనీకి దేశవ్యాప్తంగా 17 సిమెంట్‌ తయారీ యూనిట్లు, సొంత విద్యుత్‌ అవసరాల కోసం తొమ్మిది విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,643 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి తోడు దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లు ఉన్నారు. అంబుజా సిమెంట్‌ 3.1 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ద్యంతో ఆరు సిమెంట్‌ తయారీ యూనిట్లు, ఎనిమిది సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్లు నడుపుతోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.